ఇస్లాంని ఫాలో అవుతానంటున్న యువన్ శంకర్ రాజ

ఇస్లాంని ఫాలో అవుతానంటున్న యువన్ శంకర్ రాజ

Published on Feb 9, 2014 7:00 PM IST

Yuvan_Shankar_Raja
తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఉన్న పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యువన్ శంకర్ రాజ ఒకరు. హ్యాపీ, ఓయ్, పంజా లాంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ని అందించి తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే అతను మ్యూజిక్ అందించిన ఈనో సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ప్రస్తుతం సూర్య, సమంత జంటగా నటిస్తున్న ‘అంజాన్’ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఈ రోజు యువన్ శంకర్ రాజ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను, అలాగే తను మూడో సారి పెళ్లి చేసుకోనున్నాడు అని వస్తున్న వార్తలను కొట్టి పారేసాడు. ‘నేను మూడోసారి పెళ్లి చేసుకోవడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు. అలాగే నేను ఇస్లాం ని ఫాలో అవుతాను, ఆ విషయంలో గర్వంగా ఫీలవుతున్నాను. ఆ విషయాన్ని నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. నాను నానకి మధ్య ఎలాంటి అపార్ధాలు లేవని’ ట్వీట్ చేసాడు.

యువన్ ఇలా చెప్పిన తర్వాత అతనికి తన ఫ్రెండ్స్ మరియు తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది.

తాజా వార్తలు