తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేయగల అతి కొద్ది మంది హీరోయిన్స్ లో ప్రియమణి కూడా చేరిపోయింది. తాజాగా ప్రియమణి డబుల్ రోల్ చేసిన చారులత సినిమాలో నటనకి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తను ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చేయాలనుకోవటం లేదని తెలిపింది. ‘ నేను ఒకే రకమైన పాత్రలకి పరిమితమవ్వాలని అనుకోవటం లేదు. చారులత సినిమా తర్వాత అలాంటి కథలే నాదగ్గరికి చాలా వచ్చాయి. కానీ నేను వాటిని అంగీకరించలేదు. నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాలు చేయడానికి నేను సిద్దమే’ అని ప్రియమణి తెలిపింది. ప్రస్తుతం ప్రియమణి ‘చండి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కృష్ణం రాజు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే త్వరలో విడుదల కానున్న షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. వీటన్నిటితో మాటు మలయాళంలో ది ట్రూ స్టొరీ అనే సినిమాలో నటిస్తోంది.