వెయింగ్ మెషిన్ ఎప్పుడూ నాతొ పాటే వుంటుంది : ఛార్మీ

charmii
పంజాబీ భామ ఛార్మీ చాన్నాళ్ళుగా హిట్ కోసం ఎదురుచూస్తుంది. షూటింగ్ మధ్య విరామ సమయంలో ఈ మధ్య ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈవిధంగా తెలిపింది “నేను బరువు చాలా తగ్గాలి. అందుకే నాతొ పాటూ ఒక వెయింగ్ మెషిన్ ను కూడా తీసుకెళ్తూవుంటాను. డైటింగ్ పేరు చెప్పి నోరు కుట్టేసుకోకుండా ఖాళీ సమయాల్లో వ్యాయామం చేసి నా బరువు తగ్గించుకుంటున్నాను. నేను ఇంటర్నెట్ కు బానిసనయ్యాను. అలాగని సోషల్ నెట్వర్కింగ్ సైట్లను వాడను. ఫ్యాన్స్ కు మెయిల్ ద్వారా అందుబాటులోవుంటాను. అప్పుడప్పుడూ చాట్ చేస్తాను. నా ఫ్యాన్స్ ఇచ్చిన మెయిల్ లకు రిప్లై ఇస్తూ వారందించిన సలహాలను పాటిస్తాను”

ఈ భామకు ఒక తుంటరి కోరిక కూడా వుందట “ఏకాంతంగా వున్నప్పుడు చంద్రమండలంలో మంచి నటిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటాను. నిజానికి నేను టాలీవుడ్ ను చంద్రుడిపైకి మార్చి అక్కడ ఒక కొత్త పేరును పెట్టాలని వుందని” తన కోరికలను చెప్పుకుని నవ్వుకుంది ఛార్మీ

Exit mobile version