నటనని నేనెప్పటికీ వదలను: జెనీలియా


బబ్లీ బ్యూటీ జెనీలియా ఇటీవలే ఆమె ప్రియుడు రితేష్ దేశ్ ముఖ్ ని వివాహమాడిన విషయం తెల్సిందే. ఆమె వివ్హమా చేసుకున్న తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తుందా అనే విషయం పై ఇటు టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాలలోను అటు బాలీవుడ్ వర్గాలలోను చర్చ కొనసాగుతుంది. ఇటీవలే ఆమె ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన నా జీవితంలో ఒక ముఖ్య భాగం, నేను నటనను వదిలే ప్రసక్తే లేదు అంటుంది జెనీలియా. జెనీలియా ఇటీవలే రానా సరసన ‘నా ఇష్టం’ సినిమాలో నటించింది. కొత్తగా ఏ సినిమాలు అంగీకరించనప్పటికీ త్వరలో మళ్లీ ఆమె మరిన్ని సినిమాలు చేయాలనీ ఆశిద్దాం.

Exit mobile version