అంతమంది మగవాళ్ళ మధ్య నేనొక్కదాన్నే అమ్మాయిని – కాజల్


తెలుగు ప్రేక్షకులకు మరియు ఎంతో మంది యువకులకు అభిమాన తార అయిన కాజల్ అగర్వాల్ కి తను చేసే ప్రతి పాత్ర నాకు మరియు చూసే వారికి అబ్బ ఎంత కొత్తగా ఉందో అని అనుకున్నప్పుడే తనకి సంతోషమని అంటోంది. ఇది విని ప్రస్తుతం మీరు ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అలాంటి పాత్రలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు కాజల్ సమాధానమిస్తూ ‘ ప్రస్తుతం బాలీవుడ్లో అక్షయ్ కుమార్ సరసన ‘స్పెషల్ చబ్బీస్’ అనే సినిమా చేస్తున్నాను. అందులో నాది ఒక టీచర్ పాత్ర. టీచర్ అంటే అందులో పెద్ద గొప్ప ఏముంది అంటారా? సినిమాలో మొత్తం 26 పురుషుల పాత్రలు ఉంటాయి వారందరిలో నాదొక్కటే లేడీ పాత్ర. ఈ సినిమా చేస్తున్నప్పుడు కొత్త అనుభూతికి లోనవుతున్నాను’ ఆమె అన్నారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ మరియు రవితేజ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల్లో కాజల్ ఎలాంటి కొత్త పాత్రలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో? వేచి చూడాలి మరి.

Exit mobile version