నేను ఐ.బి.ఎల్ కు ప్రచారకర్తగకాను : భూమిక

నేను ఐ.బి.ఎల్ కు ప్రచారకర్తగకాను : భూమిక

Published on Aug 31, 2013 7:49 PM IST

bhumika

దాదాపు తెలుగులో అగ్రతారలందరితో నటించిన భూమిక ఆ తరువాత ఆ వేగాన్ని కొనసాగించలేకపోయింది. ఇప్పుడు పెళ్ళయిన తరువాత మరోసారి ‘అనసూయ’ సినిమాతో తనకు హిట్ ఇచ్చిన రవిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది

తాజాగా ఐ.బి.ఎల్ జట్టుతో గడుపుతున్న ఈ భామ ఐ.బి.ఎల్ కు ప్రచారకర్తగా ఎంపికయ్యింది అనే పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పుకార్లకు భూమిక ధీటుగా స్పందించి తన స్నేహితులైన గోపీచంద్, సైనా నెహ్వాల్ ను కలవడానికి వచ్చానే తప్ప ఐ.బి.ఎల్ కు ప్రచారకర్తగా ఎంపికయ్యానన్న వార్తలో నిజంలేదని తెలిపింది. అంతే కాక తన స్కూల్ ఏజ్ లో బ్యాడ్మింటన్ అడినందువలనే ఈ ఆటపై మక్కువ ఎక్కువ అని తెలిపింది. భూమిక ఈ మధ్యే 6 కోట్ల వ్యయంతో బెంగుళూరులో ఒక విల్లాను తీసుకుందట. వాళ్ళ ఆయన భారత్ ఠాకూర్ తో కలిసి త్వరలో అక్కడకు మకాం మార్చనుందని సమాచారం

తాజా వార్తలు