ఈ మధ్య హీరో ప్రిన్స్ కు ఆఫర్లు వెల్లివిరిస్తున్నాయి. ప్రస్తుతం అతని చేతిలో నిర్మాణ దశలో వున్న కొన్ని సినిమాలు వున్నాయి. ఈరోజు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నాకు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయాలు బాగానే వున్నాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు తేజ తప్ప ఇంకెవరూ తెలియదు. ఆయనే నన్ను హీరోగా మార్చారు. నేను ఆయనకు రుణపడివుంటానని”తెలిపాడు. అతని పేరు వెనుక వున్న రహస్యం ఏమిటని అడగగా “మా నాన్నగారికి ఆయన అన్నయకంటే ముందుగా పెళ్లి జరిగింది. ఆయనకు పుట్టిన మొదటి బిడ్డను నేను. ఆ తరంలో మొదటి సంతానం గనుక మా తాత గారు నాకాపేరు పెట్టారు. నాకు కూడా మహేష్ బాబు చాలా ఇష్టం. నా లుక్స్ మహేష్ తో పోల్చడం నాకు ఆనందం”అని తెలిపాడు. ‘మనసు మాయ సేయకే’ సినిమా ద్వారా తమిళ సినీ రంగంలోకి ప్రవేశించనున్నాడు
ఇటీవలే వెటరన్ డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించాడు. ‘బన్నీ అండ్ చెర్రీ ‘ సినిమాను నిర్మిస్తున్న మల్టీ డైమెన్షన్స్ నిర్మాణంలోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంటుంది