‘బన్నీ – అట్లీ’ సినిమా కోసం భారీ సెట్ !

‘బన్నీ – అట్లీ’ సినిమా కోసం భారీ సెట్ !

Published on Oct 13, 2025 8:07 AM IST

alluarjun-atlee

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోని ఓ స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ – మిగిలిన ప్రధాన పాత్రల పై భారీ యాక్షన్ సీన్స్ ను ఘాట్ చేస్తారట. ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉంటాయట. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో బన్నీ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బన్నీ పాత్రకు సంబంధించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోని యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయట. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి.

తాజా వార్తలు