‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ డిమాండ్?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమా పై ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్ర ఓవర్సీస్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నడుస్తుందట. ఈ మూవీకి అక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు.

దీంతో ఈ చిత్రాన్ని అక్కడ ఎవరు రిలీజ్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version