నాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో గ్రాండ్ లెవెల్లో చేస్తున్న సెన్సేషనల్ చిత్రమే “ది ప్యారడైజ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతూ ఉండగా మేకర్స్ భారీ ఖర్చుతో ఎక్కడా వెనకాడకుండా సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
మరి ఇలానే ఓ సింగిల్ సెట్ కోసం ఏకంగా 7 కోట్లకి పైగా పడుతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోనే ఒక ప్యాలెస్ లాంటి సెట్ వేసేందుకు ఈ భారీ ఖర్చుని పెడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమాలో విజువల్స్ గ్రాండియర్ ఎలా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 26న పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.
