‘అఖండ 2’లో అది ఎలా కవర్ చేస్తారు..?

Akhanda 2

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. మొదటి భాగానికి పర్ఫెక్ట్ సీక్వెల్‌గా ఇందులో కథను సజావుగా ముందుకు తీసుకెళ్లినట్టు సమాచారం.

అయితే, ఈసారి ప్రగ్యా జైస్వాల్ లేకపోవడంతో ఆమె ‘మిస్సింగ్ లింక్’ ను బోయపాటి ఎలా హ్యాండిల్ చేశాడన్నదే ఆసక్తికర అంశం. తొలి పార్ట్‌లో ప్రగ్యా జైస్వాల్ పాత్రను పక్కాగా రాసుకుని కథను ముందుకు తీసుకెళ్లారు. కానీ, ఇప్పుడు సీక్వెల్ చిత్రంలో ఆమె నటించడం లేదు. కాగా మరో బ్యూటీ సంయుక్త కొత్త హీరోయిన్‌గా కనిపించనుంది.

థమన్ సంగీతం, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం హిందీతో పాటు 3Dలో కూడా విడుదల కానుంది. విడుదలకు ఒక రోజు ముందే పేడ్ ప్రీమియర్ లను ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version