రానా బి.టెక్ బాబుగా నటిస్తున్న ‘కృష్ణం వందే జగద్గురుం’ రేపు విడుదల కాబోతుంది. వీసా వస్తే అమెరికా వెల్లిపోదామనుకున్న బి.టెక్ బాబుకి తమ వారసత్వంగా వస్తున్న నాటకాల ఆసక్తి ఉండదు. నాటకాల వల్ల ఏం ఉపయోగం ఉండదు అని నమ్ముతుంటాడు. తన తాత బలవంతం మీద నాటకాల్లో నటిస్తాడు. అదే సమయంలో జర్నలిస్ట్ దేవిక (నయనతార) పరిచయమవుతుంది. దేవిక మాటలు బి.టెక్ బాబు ఆలోచనని మారుస్తాయి. తన ఊరిలో జరుగుతున్న మైనింగ్ మాఫియాని ఎలా అడ్డుకున్నాడు అనేది కృష్ణం వందే జగద్గురుం చిత్ర కథ. నయనతార మాటలు రానా మీద ఎంత ప్రభావం చూపాయి అన్నది మా సినిమాలో కీలకం అంటున్నాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాని జాగర్లమూడి సాయిబాబు, వై, రాజీవ్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.