భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ తాను నిర్మించబోయే హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాసినట్లు తెలుస్తోంది. కాగా ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం.
మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోందని ఇప్పటికే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అన్నట్టు ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది. అయితే ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వర్చ్యువల్ టెక్నాలజీని వాడటమే కారణం అని తెలుస్తోంది. అలాగే పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారట. ఇక రానా చేస్తున్న ‘అరణ్య’ విడుదలకు రెడీ అయింది.