పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి స్వరపరచిన “తారా తారా – ది సిజ్లింగ్ సింగిల్” అనే లిరికల్ ట్రాక్ రిలీజ్ టైమ్ ను టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల మే 28న ఉదయం 10:20 గంటలకు ఈ పూర్తి పాట విడుదల కానుంది. ఈ సాంగ్ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రాక్ చాలా బాగా వచ్చింది అని టాక్ నడుస్తోంది.
అన్నట్టు డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే
#TaaraTaara – The Sizzling Single! ????
Get ready to groove to the hottest track of the year from #HariHaraVeeraMallu ????
Full song out on 28th May @ 10:20 AM! ????
All set to Turn up the volume, and feel the heat! ????⚡️#HHVMonJune12th #HHVM #DharmaBattle #VeeraMallu
Powerstar… pic.twitter.com/2wQ85AZ6hv
— Mega Surya Production (@MegaSuryaProd) May 26, 2025