కథానాయికకు తిరిగి వచ్చిన ప్రాధాన్యం

ప్రస్తుతం ఉన్న కథానాయికలు సమంత,ఇలియానా,అనుష్క,తమన్నా, శ్రుతి హాసన్ త్రిష అందరు చిత్రాల మీద ప్రభావం చూపుతున్నారు. పూర్తిగా పురుషాధిపత్యం ఉన్న ఈ పరిశ్రమ లో ఇది చెప్పుకోవాల్సిన విషయం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం లో తన పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని సమంత చెప్పుకొచ్చింది . ఈ చిత్రం లో ఇద్దరు ప్రధాన హీరోలు ఉన్నా తన పాత్ర ఆశ్చర్యం కలిగిస్తుందని కూడా చెప్పారు. “ఏ మాయ చేసావే” చిత్రం తో తనని పరిచయం చేసిన గౌతం మీనాన్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం “ఎటో వెళ్లిపోయింది మనసు ” చిత్రం గురించి కూడా సమంత చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

“బద్రీనాథ్” , “100% లవ్ ” “ఊసరవెల్లి” చిత్రాలలో తమన్నా తనకు ప్రాదాన్యమున్న పాత్రలు చేసింది. శ్రుతి హాసన్ “గబ్బర్ సింగ్” లో తన పాత్ర అభిమానులను ఆశ్చర్య పరుస్తుందని అన్నారు. నిత్య మీనాన్ కూడా “ఇష్క్” విషయం లో ఇదే అన్నారు. అరుంధతి విషయం లో అనుష్క కూడా అదే అన్నారు ప్రస్తుతం “డమరుకం” చిత్రం లో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నట్టు సమాచారం.

Exit mobile version