పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఇటీవల మొదలైన షూటింగ్ కోసం ఆయన మేకోవర్ కావడం జరిగింది. కఠిన చాతుర్మాస్య దీక్ష కోసం గడ్డం జుట్టు పెంచేసిన పవన్, వకీల్ సాబ్ షూట్ కోసం క్లీన్ షేవ్ లో నీట్ గా సిద్ధం అయ్యాడు. ఇటీవల సూటు, బూటులో హైదరాబాద్ మెట్రోలో పవన్ సందడి చేయగా, ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. పవన్ న్యూ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
కాగా వకీల్ సాబ్ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రుతీ ఇంత వరకు వకీల్ సాబ్ షూట్ లో పాల్గొనలేదు. తక్కువ నిడివి కలిగిన పవన్ భార్య పాత్రలో శృతీ హాసన్ కనిపించనుంది. పవన్-శ్రుతీ కాంబినేషన్ సీన్స్ ని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. డిసెంబర్ మొదటివారంలో మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో శృతీ హాసన్ పార్ట్ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్ అని సమాచారం. పవన్, శ్రుతీపై ఓ రొమాంటిక్ సాంగ్ కూడా షూట్ చేయాల్సి ఉంది.
దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిందీ హిట్ చిత్రం పింక్ తెలుగు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. చిత్రీకరణ చివరి దశలో ఉండగా 2021లో విడుదల కానుంది. వకీల్ సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.