హీరోయిన్ లక్ష్మీ రాయి తండ్రి రామ్ రాయ్ నిన్న మరణించడం జరిగింది. అనారోగ్యం కారణం రామ్ రాయ్ మరణించినట్లు తెలుస్తుంది. దీనితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తండ్రిని కోల్పోయిన లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన, బాధ అభిమానులతో పంచుకున్నారు. నిన్ను కాపాడుకోలేక పోయాను క్షమించు నాన్న అని లక్ష్మీ రాయ్ తన సందేశంలో పొందుపరిచారు.
ఇక నాన్న లేరన్న విషయం కృంగదీస్తుంది అన్న రాయ్ లక్ష్మీ ఈ లోటును భరించడానికి నాకు స్ట్రెంథ్ కావాలి, అన్నారు. మీరు ఎక్కడ ఉన్నా నాపై మీ బ్లెస్సింగ్ ఉంటాయని, లక్ష్మీ రాయ్ తన సుధీర్గ సందేశంలో అనేక విషయాలను, ఎమోషన్స్ ని తెలియజేశారు.
గత ఏడాది వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ అనే చిత్రం ద్వారా లక్ష్మీ రాయ్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం సౌత్ లోని పలు భాషలలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు. ఝాన్సీ ఐ పి ఎస్ లో పోలీస్ రోల్ చేస్తున్న లక్ష్మీ రాయ్…సిండ్రెల్లా అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. అలాగే ఆనంద భైరవి పేరున తెరకెక్కుతున్న ఓ తెలుగు చిత్రంలో కూడా లక్ష్మీ రాయ్ నటిస్తున్నారు.
https://www.instagram.com/p/CHRwgw1nEJC/