ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్లో అనుకోని అవాంతరం ఎదురైంది. ప్రభాస్, రానా ముఖ్య పాత్రలుగా, అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చారిత్రాత్మక నేపధ్యంలో సాగుతున్న కారణంగా ప్రధానపాత్రలందరికి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాల శిక్షణ ఇస్తున్నారన్న విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు అనుకోకుండా గుర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్న రానా కిందపడడంతో అతని కాలికి గాయమయ్యింది. హుటాహుటున రానాను హైదరాబాద్ ‘కేర్’ హాస్పిటల్ కు తరలించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.