మన తెలుగు సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచే పలు పురస్కారాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి వాటిలో గత కొన్నేళ్ల నుంచి అవైటెడ్ గా తెలంగాణ రాష్ట్ర అవార్డులు కూడా ఒకటి. అయితే ప్రముఖ విప్లవ గేయ రచయిత గద్దర్ పేరిట ఆయన గౌరవార్థం అనౌన్స్ చేసిన ఈ అవార్డులుకి సంబంధించిన వివరాలు ఎట్టకేలకి బయటకి వచ్చాయి. ఈ జూన్ 14న హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుకలో ఏయే చిత్రాలకి ఏయే విభాగాల్లో గద్దర్ పురస్కారం దక్కిందో పూర్తి వివరాలు చూద్దాం.
ఫీచర్ ఫిల్మ్‌లు:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఎడి
రెండవ ఉత్తమ చిత్రం: పొట్టేల్
మూడవ ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్
జాతీయ సమగ్రత చిత్రం: కమిటీ కుర్రోళ్లు
పిల్లల సినిమా: 35 చిన్న కథ కాదు
పర్యావరణం/వారసత్వం/చారిత్రాత్మక చిత్రం: రజాకార్
తొలి దర్శకుడు: శ్రీ యెదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
వినోదాత్మక చిత్రం: ఆయ్… మేమ్ ఫ్రెండ్స్ అండి
వ్యక్తిగత అవార్డులు:
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి 2898 AD)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేతా థామస్ (35 చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన, “నిజమే నే చెబుతున్నా”)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2, “సూసేకి అగ్గి రవ్వ”)
ఉత్తమ హాస్యనటుడు: సత్య & వెన్నెల కిషోర్ (మత్తు వదలారా 2)
ఉత్తమ బాలనటుడు: అరుణ్‌దేవ్ పోతుల (35 చిన్న కథ కాదు) & హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ (గామి)
ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేష్ ఆచార్య (దేవర, “ఆయుధ పూజ”)
ఉత్తమ కళా దర్శకుడు: అద్నితిన్ జిహాని చౌదరి (కల్కి 2898 AD)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనరావు & అజయ్ కుమార్ (కల్కి 2898 AD)
ప్రత్యేక జ్యూరీ అవార్డులు:
ప్రత్యేక జ్యూరీ అవార్డు 1: దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ 2: అనన్య నాగల్ల (పొట్టేల్)
ప్రత్యేక జ్యూరీ అవార్డు 3: సుజిత్ & సందీప్ (క)
స్పెషల్ జ్యూరీ అవార్డు 4: ప్రశాంత్ రెడ్డి & రాజేష్ కల్లేపల్లి (రాజు యాదవ్)
జ్యూరీ;లో ప్రత్యేక ప్రస్తావన: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలారా 2, “డ్రామా నక్కో మామా – రాప్”)
సినిమాపై సాహిత్యం:
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటల జయదేవ)
ఈ రకంగా అయితే గతేడాదిలో వచ్చిన పలు ఉత్తమ చిత్రాలు అలాగే నటీనటులు ఇంకా టెక్నీషియన్స్ పలు విభాగాల్లో గద్దర్ పురస్కారాన్ని అందుకున్నారు.