విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ తో పాటు, టీజర్స్ మరియు ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ భారీగానే బిజినెస్ జరిపినట్లు తెలుస్తుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఏపీ మరియు తెలంగాణలలో కలిపి వరల్డ్ ఫేమస్ లవర్ 22కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ మాత్రం వసూళ్లను సాధించాలంటే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ దక్కించుకోవాలి.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని దర్శకుడు క్రాంతి మాధవ్ మూడు విభిన్న ప్రేమకథల సమాహారంగా తెరకెక్కించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థెరిస్సా, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు. ఈనెల 14న తెలుగు మరియు తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.