మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ అండ్ గ్రాండ్ ఎంటర్టైనింగ్ షో బిగ్ బాస్ సీజన్ 4 కు ఈరోజుతో స్టార్ మా ఛానెల్లో లాంచ్ కానుంది. లాస్ట్ సీజన్ తో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ను అందించి ఇండియాలోనే టాప్ టీఆర్పీ రేటింగ్ ను అందించిన కింగ్ నాగార్జునే మళ్ళీ ఈసారి కూడా హోస్ట్ గా చెయ్యనుండడంతో మళ్ళీ ఈ షో పై అంచనాలు పెరిగాయి.
అయితే ఈసారి సీజన్లో ఎవరెవరు కంటెస్టెంట్స్ గా కనిపించనున్నారో అన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు మీ కోసం మాకు ఉన్న సమాచారం ప్రకారం తెలియజేస్తున్నాం. మా బజ్ ప్రకారం మన తెలుగు యూట్యూబ్ ఫేమ్ గంగవ్వ, హారిక, మెహబూబ్, అలాగే స్మాల్ స్క్రీన్ నుంచి టీవీ 9 యాంకర్ దేవి, అలాగే లాస్య, సుజాత(జోర్దార్ షో), తనూజ(ముద్దమందారం), సైయద్ సోహాలి, అరియానా గ్లోరీలు కనిపించనుండగా..
మన తెలుగులో హిట్ సినిమాలు తీసిన ఇద్దరు దర్శకులు సూర్య కిరణ్(సత్యం) అలాగే రణం ఫేమ్ అమ్మ రాజశేఖర్ లు కూడా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నటుడు మరియు తెలుగు ర్యాప్ సింగర్ నోయెల్, నటి కరాటే కళ్యాణి మరియు మోనాల్ గజ్జర్ లు ఈసారి బిగ్ బాస్ సీజన్లో కనిపించనున్నారు. మరి కంటెస్టెంట్స్ వీరే ఉన్నారా లేదా అన్నది ఈరోజు సాయంత్రం స్టార్ మా లో సాయంత్రం 6 గంటలకు లైవ్ యాక్షన్ చూడాల్సిందే.