త్వరలో నితిన్ ‘హార్ట్ ఎటాక్ ‘టీజర్

Puri-Nithin

యంగ్ హీరో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘హార్ట్ ఎటాక్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరగుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ని త్వరలో విడుదల చేయనున్నారని సమాచారం. అది ఈ వారంలో విడుదల కావచ్చు. ఇప్పటికి వరుసగా రెండు సినిమాలలో నితిన్ హిట్ సాదించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అదా శర్మ హిరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాని పూరిజగన్నాథ్ తన స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం కీ రోల్ చేయనున్నాడని సమాచారం. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, స్పెయిన్ లలో నిర్వహించనున్నారు.

Exit mobile version