‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో పనిచేస్తున్న పలు టెక్నిషియన్స్ ఈ సినిమా అద్భుతంగా రావడంకోసం పడుతున్న కష్టాన్ని హరీష్ శంకర్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు ప్రస్తుతం హరీష్ శంకర్ చెన్నైలో నేపధ్య సంగీతాన్ని పూర్తిచేయించుకునే పనిలో వున్నాడు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన థమన్ ప్రస్తుతం నేపధ్య సంగీతం అందించేపనిలోవున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ కష్టపడుతున్న తీరు హరీష్ కు చాలా నచ్చిందట ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న విడుదలకానుంది. ఎన్.టి.ఆర్ అభిమానులు ఈ సినిమా విడుదలకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.