కన్ఫర్మ్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ పై హరీష్ శంకర్

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కోసం అందరికీ తెలిసిందే. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ డిసెంబర్ లో ఉంటుంది అని ఆల్రెడీ మేము చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి దర్శకుడు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫుల్ జోష్ ఇచ్చే అప్డేట్ రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో అది సాంగ్ కోసమే అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version