హరీష్ శంకర్ ఎప్పుడైతే తన సినిమాలలో లోకల్ టాలెంట్ కు పెద్దపీట వేస్తానని చెప్పాడో అప్పటినుండి ఆ విషయంపై హాట్ టాపిక్ గా మారిపోయాడు. గతంలో ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా మంది చెప్పినా వాటిని నిలబెట్టుకున్నవారు మాత్రం తక్కువనే చెప్పాలి. ఈ వ్యాఖ్య చేసిన వెంటనే తన తాజా సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ లో నటిస్తున్న సమంత, శృతి హాసన్ లు ఆంధ్ర ప్రదేశ్ వారు కాదని చాలామంది అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి హరీష్ సమాధానమిస్తూ “మిత్రులారా నా హీరోయిన్స్ గురించి బుర్రలు బద్దలుకోట్టేసుకోకండి.డైలాగుల విషయానికి వస్తే నా సినిమాలో హీరోయిన్స్ అందరూ తెలుగు చక్కగా మాట్లాడతారు” అని అన్నాడు. వీరిద్దరికీ తెలుగు వచ్చినా ప్రస్తుతానికి సొంత డబ్బింగ్ చెప్పుకోవడంలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఎన్.టీ.ఆర్, సమంత మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రధారులు. దిల్ రాజుఈ సినిమాకు నిర్మాత