పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
నేడు(డిసెంబర్ 9) సాయంత్రం 6.30 గంటలకు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. కాగా, ఇప్పుడు ఈ పాటపై హైప్ తీసుకొస్తూ చిత్ర యూనిట్ ఈ సాంగ్ షూటింగ్ సమయంలో క్లిక్ చేసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేస్తుండగా ఆయన్ను కన్నార్పకుండా దర్శకుడు హరీష్ శంకర్ చూస్తున్న ఫోటోను యూనిట్ పోస్ట్ చేశారు.
దీంతో ఉస్తాద్ ఎలాంటి స్టెప్పులతో ఇరగదీస్తాడా అని అభిమానులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
