యూఎస్ లో ‘హరిహర వీరమల్లు’ డీల్ పూర్తి.. వీర కూడా ఆ సంస్థకే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్నారు. మరి ఫైనల్ గా వారి నిరీక్షణకి శుభం కార్డు పడగా సినిమా రిలీజ్ సన్నాహాలు ఇపుడు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇన్ని రోజులు అన్నీ బాగున్నాయి కానీ యూఎస్ లో ఏ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది అనేది క్లారిటీ లేదు.

మరి దీనిపై ఫైనల్ గా ఓ క్లారిట్రీ ఇపుడు వచ్చేసింది. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారే సొంతం చేసుకున్నారు. అలాగే ఈ శుక్రవారం నుంచే బుకింగ్స్ ఓపెన్ కానున్నట్టుగా కూడా ఖరారు చేశారు. మరి ఆల్రెడీ పవన్ మరో బిగ్గెస్ట్ సినిమా ‘ఓజి’ హక్కులు కూడా వీరి దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. దీనితో బ్యాక్ టు బ్యాక్ పవన్ సినిమాలు వీరి నుంచి రానున్నాయి.

Exit mobile version