‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ థియేటర్స్ లో ప్లాన్ చేయాల్సిందేనా!

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి సినిమాకి అయినా కూడా హైప్ ఇచ్చేది ఆ సినిమా తాలూకా ట్రైలర్ కట్ అనే చెప్పాలి. అప్పుడు వరకు వచ్చిన కంటెంట్ వేరు సినిమా ట్రైలర్స్ వేరు అని చెప్పవచ్చు. ఇప్పుడు టీజర్ లు, గ్లింప్స్ లు అంటూ చాలానే వస్తున్నాయి కానీ ఎప్పుడు నుంచో ఏ సినిమాకి అయినా కూడా ట్రైలర్ నే ప్రధానం.

అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పట్లే అంతా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యం అవ్వడంతో ఉన్న హైప్ సన్నగిల్లింది. మరి దీనిని మళ్ళీ పైకి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా అది ట్రైలర్ వల్లే అవుతుంది అని నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం నమ్ముతున్నారు.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇదే ట్రైలర్ కీలక పాత్ర పోషించనుంది అని చెప్పవచ్చు. బిజినెస్ పరంగా ఇంకా ఆఫ్ లైన్ లో కూడా హరిహర వీరమల్లు పట్ల అంత క్లారిటీ కనిపించడం లేదు. దీనితో ఆఫ్ లైన్ లో రచ్చ మొదలు కావాలి అంటే ట్రైలర్ లాంచ్ ని నేరుగా థియేటర్స్ లోనే ప్లాన్ చేయాలి అన్నట్టుగా అభిమానులు కూడా భావిస్తున్నారు.

దీనిని పక్కాగా ప్లాన్ చేసుకుంటే రీచ్ బాగుంటుంది అని ఆ మధ్య కాలంలో కూడా చాలా సినిమాలకి ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది. సో థియేటర్స్ లో భారీ ఎత్తున హరిహర వీరమల్లు ట్రైలర్ ని విడుదల చేసుకుంటే అది మేకర్స్ కే ప్లస్ కావచ్చని చెప్పాలి. మరి ఈ కీలక అంశంపై మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.

Exit mobile version