ఉత్తరాంధ్రలో ‘వీరమల్లు’ తుఫాన్.. డే 1 కి రికార్డు రిలీజ్!

HHVM

చాలా కాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. తాను డిప్యూటీ సీఎం అయ్యిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇది కాగా అనేక ఇబ్బందులు ఆటుపోట్లు నడుమ ఈ జూలై 24న సినిమా గ్రాండ్ గా విడుదలకి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కి ఉత్తరాంధ్రలో ఫాలోయింగ్ చాలా ఎక్కువే మరి దీనితో ప్రస్తుతం ఒక హిస్టారిక్ రిలీజ్ కి వీరమల్లు లాక్ అయ్యిందట.

ఉత్తరాంధ్రలో రికార్డు స్క్రీన్స్ లో రిలీజ్

పవన్ సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్ లో ఉత్తరాంధ్ర కూడా ఒకటి. అయితే వీరమల్లు అక్కడ మొత్తం ఉన్న 150 థియేటర్స్ లో ఏకంగా 135 థియేటర్స్ వీరమల్లు పడబోతుందట. ఇది భారీ రికార్డు అని తెలుస్తుంది. అంతేకాకుండా మొదటి వారం వరకు కూడా 125 థియేటర్స్ లో సినిమా రన్ అవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

డే 1 బిగ్ రికార్డ్స్ పడతాయా?

హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కెరీర్లో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ పడతాయని తెలుస్తుంది. రికార్డు స్క్రీన్స్ లో విడుదల అవుతుండడంతో మొదటిరోజు మాత్రం ఊహించని ఓపెనింగ్స్ ప్రీమియర్స్ తో కలిపి వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version