పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఒక స్ట్రైట్ సినిమా చాలా కాలం తర్వాత రిలీజ్ కి వస్తుంది. ఆ సినిమానే “హరిహర వీరమల్లు”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నుంచి మొదలై ఇపుడు జ్యోతికృష్ణతో ముగిసిన ఈ సినిమా సెన్సార్ ని ముగించుకొని గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
అయితే కొన్ని రోజులు కితమే సెన్సార్ పూర్తి చేసుకున్న వీరమల్లు జీరో కట్స్ తో యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకున్నట్టు తెలిసింది. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ బయటకి వచ్చింది. దీనితో వీరమల్లు సినిమా మొత్తం 162 నిమిషాలు (అన్ని క్రెడిట్స్ కలిపి) రాబోతుండగా ఇందులో కొన్ని మైనర్ కట్స్ ని సెన్సార్ యూనిట్ చెప్పింది. మొత్తం 5 కట్స్, రీప్లేస్ మెంట్స్ హరిహర వీరమల్లుకి పడ్డాయి.
స్టార్టింగ్ వాయిస్ ఓవర్ తో కూడిన నిరాకరణ నుంచి కుళి కుతుబ్ షాహ్, కొన్ని విగ్రహాల కరిగింపు అలాగే ఒక గర్భస్థ స్త్రీని హింసించే సన్నివేశం అలాగే ఆలయ ద్వారాన్ని కాలితో తన్నే సీన్స్ వంటివి సెన్సార్ వారు ఆబ్జెక్ట్ చేశారట. వీటికి వేరే మార్గాలు సెట్ చేయాలని సూచించారు. సో వీటికి కొత్త మార్పులతో వీరమల్లు జూలై 24న థియేటర్స్ లో పడనుంది.