హరిహర వీరమల్లు.. ఇంకా ఎన్ని రోజులు..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.

అయితే, ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసుకుని, ఈ వేసవి కానుకగా మే 9న గ్రాండ్ రిలీజ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఈ డేట్‌లో కూడా హరిహర వీరమల్లు రిలీజ్ కావడం డౌటే అని తెలుస్తోంది. ఇంకా సినిమా పనులు పెండింగ్ ఉన్నాయని.. అందుకే ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయడం లేదని చిత్ర వర్గాల ఇన్‌సైడ్ టాక్.

ఈ లెక్కన ఈ చిత్రం ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

Exit mobile version