అందాల భామ తాప్సీకి జన్మదిన శుభాకాంక్షలు

అందాల భామ తాప్సీకి జన్మదిన శుభాకాంక్షలు

Published on Aug 1, 2012 11:26 AM IST


అందాల భామ తాప్సీ మొదటి చిత్రం తోనే తన క్యూట్ లుక్స్ మరియు తెలుగమ్మాయిలా కనపడి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ రోజు ఈ ఢిల్లీ బ్యూటీ పుట్టిన రోజు. 1987 ఆగష్టు 1న తాప్సీ డిల్లీలో జన్మించారు. తాప్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సాప్ట్ వేర్ ఇంజనీర్ గా కూడా కొంత కాలం పని చేశారు. ఉద్యగం చేస్తూనే మోడలింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడల్ గా కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాప్సీ 2008లో ‘పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ పేస్’ మరియు ‘ సఫి ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్కిన్’ టైటిల్స్ ను కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ప్రముఖ కంపెనీల కమర్షియల్ ఆడ్ లలో కూడా కనిపించారు. 2010లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘ ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే సంపాదించుకున్నారు.. ప్రస్తుతం తాప్సీ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

తెలుగు తన సొంత భాష కాకపోయినా ఎంతో ఆసక్తితో తెలుగు నేర్చుకొని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే స్థాయికి తాప్సీ ఎదిగింది, అలా చేసే అతి కొద్ది మంది కథానాయికల జాబితాలో తాప్సీ కూడా చేరిపోయారు. ప్రస్తుతం తాప్సీ తెలుగులో ‘గుండెల్లో గోదారి’ మరియు వెంకటేష్ సరసన ‘షాడో’ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ‘చష్మే బదూర్’ సినిమాతో ఈ సంవత్సరం బాలీవుడ్ కి పరిచయంకానున్నారు, అంతే కాకుండా ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు మరియు కన్నడంలో ఒక సినిమా చేస్తున్నారు. తాప్సీ ఇలానే మంచి పాత్రలు తెలుగు వారి మదిలో నిలిచిపోవాలని కోరుకుందాం.

ఈ రోజు తాప్సీ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఈ పంజాబీ భామకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు