‘చిత్ర’మైన గళానికి జన్మదిన శుభాకాంక్షలు

K-S-Chitra
‘మాతృదేవోభవ’గా వేణువై భువనానికి వచ్చినా .. ఆకాశాన సూర్యుడుండడు అని ‘సుందరాకాండ’లో ఆలపించినా..నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ ‘వర్షం’తో చిలిపిగా కబుర్లు చెప్పినా ఆ సున్నితమైన స్వరాలకు తన రసరమ్య గానంతో ప్రాణం పోసిన స్వరం శ్రీమతి కె.ఎస్ చిత్ర గారిది. నేటితో ఆవిడ 50వ వసంతంలోకి అడుగిడనుంది. ఈ గానకోయిల 1963లో తిరువనంతపురంలో జన్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మొదలగు 13భాషలలో ఆలపించచారు. ఈవిడ మూడు దశాబ్దాలుగా 20,000 పైగా పాటలను పాడారు. చిత్ర 6 జాతీయ అవార్డులను అందుకుని, నేపధ్య గాయనీమణులలో అత్యధిక ఉజాతీయ అవార్డులను అందుకున్న వారిగా రికార్డు నెలకొల్పింది. ‘ఈ-టివి’ లో ప్రసారమైన ప్రముఖ ధారావాహిక ‘అన్వేషిత’లో ఈవిడ పాడిన టైటిల్ సాంగ్ ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు.ఆపాటకు నంది అవార్డు అందుకున్న ఘనత చిత్రగారి సొంతం. ఉత్తమ నేపధ్య గాయనిగా లెక్కలేనన్ని అవార్డులను అందుకున్న ఈ స్వరరాణికి 123తెలుగు.కామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version