ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ స్టార్డం, భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ మొదటి నుంచి తన టాలెంట్, స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈ రోజు. 1971 సెప్టెంబర్ 2న వెంకట్ రావు – అంజన దేవి దంపతులకు జన్మించిన పవన్ నేడు తన 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు.
1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తను చేసిన ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’, ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్డం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కాస్త నిరుత్సాహపరిచినా 2012 లో ‘గబ్బర్ సింగ్’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అతని కున్న దయా గుణం, భారీగా విరాళాలు ఇవ్వడం లాంటి కొన్ని విషయాలు ఫ్యాన్స్ లో తనకున్న క్రేజ్ ని మరింత పెంచాయి.
ఎంత స్టార్డం ఉన్నా చాలా సింపుల్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.