స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సీజన్ 3 విన్నర్ అభిజీత్ ఆ షో ద్వారా ఎంతటి సెన్సేషన్ ను నమోదు చేసాడో తెలిసిందే. ఆ షో తో అంతకు ముందు ఏ సీజన్లో విన్నర్ కు రాని క్రేజ్ ను తాను దక్కించుకుని విన్నర్ గా నిలిచాడు. అందుకే ఇప్పుడు తాను సినిమాల్లో కూడా మంచి కం బ్యాక్ ఇవ్వాలని అతని ఫాలోవర్స్ కూడా ఆశిస్తున్నారు.
మరి ఇదిలా ఉండగా అభిజీత్ నిన్న జరిగిన ఆసీస్ వర్సెస్ భారత్ టెస్ట్ మ్యాచ్ చూసినట్టు ఉన్నాడు. మరి ఈ మ్యాచ్ లో మన తెలుగు బ్యాట్సమెన్ హనుమ విహారి ఎలాంటి రోల్ పోషించాడో అంతా చూసారు. అలా చూసిన వారు అతని ఆటను మెచ్చుకోకుండా కూడా ఉండలేకపోయారు. అలాగే అభిజీత్ కూడా విహారి బ్యాటింగ్ పై తన వ్యూ చెప్పాడు.
చాలా క్వాలిటీ బాటింగ్ తో స్వచ్ఛమైన గేమింగ్ స్పిరిట్ ను హనుమ విహారి చూపించాడని అతనితో సహా అశ్విన్, పుజారా, పంత్ ల పేర్లు కూడా మెన్షన్ చేసాడు. మరి ఈ పోస్ట్ కు గాను హనుమా విహారి రిప్లై ఇస్తూ అభిజీత్ కు థాంక్ యూ బ్రో అంటూ స్వీట్ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి మాత్రం ఇప్పుడు వీరి పోస్ట్ అండ్ రిప్లై లు హాట్ టాపిక్ అయ్యాయి.
Thank you bro! ????
— Hanuma vihari (@Hanumavihari) January 12, 2021