ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హంసా నందిని ఇప్పుడు టాలీవుడ్ లో ‘స్పెషల్ సాంగ్’ బ్యూటీగా చెలామణి అవుతోంది. ప్రభాస్ చేసిన ‘మిర్చి’ సినిమాలో కనిపించిన ఈ భామ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లో ఓ స్పెచుఅల్ సాంగ్ చేసింది. అలాంటి ఈ భామ త్వరలోనే ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కోసం ఎన్.టి.ఆర్ తో స్టెప్పు లేయడానికి సిద్దమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కోసం హంసా నందిని పై ఓ స్పెషల్ సాంగ్ ని త్వరలోనే షూట్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ డైరెక్టర్. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ స్పెయిన్ లో రెండు పాటలను షూట్ చేస్తోంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ఆడియో ని సెప్టెంబర్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.