రుద్రమదేవి కోసం భారీ సెట్ల యోచనలో గుణశేఖర్

Gunasekhar
మైమరిచిపోయే సెట్లు వేస్తాడని తనకి బాగా పేరు తెచ్చిన దారిలో మళ్లీ గుణశేఖర్ ప్రయానించనున్నాడు. తన తదుపరి 3డి చారిత్రాత్మక సినిమాకి భారి సెట్ నిర్మిస్తున్నాడు. రాజమౌళి తీసిన ‘మగధీర’ తో ఈ చారిత్రాత్మక సెట్ల ట్రెండ్ ఊపందుకుంది. ‘రుద్రమదేవి’ కధాంశం 14వ శతాబ్దానిది కనుక ఈ సెట్లో మరిన్ని కొత్త విషయాలు మనకి కనబడనున్నాయి. అనుష్క రుద్రమదేవిగా నటిస్తుండగా, రానా వీరబద్రుడు పాత్రలో చాళుక్య రాజుగా కనబడనున్నాడు. తోట తరుణీ ఆర్ట్ డైరెక్టర్. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 3డి షూటింగ్ టెస్ట్ ఈ మధ్యే జర్మనీలో జరిగింది. చాలా మంది జర్మన్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేయనున్నారు. ‘రుద్రమదేవి’ త్వరలోనే మొదలుకానుంది.

Exit mobile version