నేటి తరంలో మన తెలుగు ఇండస్ట్రీలోని పౌరాణిక సినిమాలను తీయగలిగే అతి తక్కువ దర్శకుల్లో గుణశేఖర్ కూడా ఒకరు. ఒక్క ఆలాంటి సినిమాలే కాకుండా మరింత పవర్ ఫుల్ సబ్జెక్టులను కూడా తీసి ఇండస్ట్రీను షేక్ చెయ్యగలరు. కానీ పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఈ స్టార్ దర్శకుడు తన సినిమాలకు ఎక్కువ గ్యాప్ నే తీసుకుంటున్నారు. అలా సుదీర్ఘ విరామం అనంతరం తాను మొదలు పెట్టిన చిత్రం “శాకుంతలం”.
మహా భారతంలోని ఓ ఆది పర్వంలోని అద్భుత ఘట్టం ఆధారంగా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ను గుణ టీం వచ్చే జనవరి నుంచి ఇవ్వనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ ఎపిక్ వండర్ లోని ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెనే సమంతా అక్కినేని. దర్శకుడు గుణశేఖర్ ఈ రోల్ కు గాను ఆమెనే ఎన్నుకొన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అలాగే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.