ట్విన్స్ బర్త్ డే గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న మంచు ఫ్యామిలీ


పద్మశ్రీ డా. మోహన్ బాబు తనయుడిగా అరంగేట్రం చేసిన మంచు విష్ణు ఈ సంవత్సరం ‘దేనికైనా రెడీ’ సినిమాతో హిట్ కొట్టి, ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న విష్ణుకి మరొక అరుదైన వేడుకని జరుపుకోనున్నారు. విష్ణు బ్యూటిఫుల్ ట్విన్స్ ఆయిన అరియానా మరియు వివియానాలు రేపటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకోనున్నారు. రేపు వాళ్ళిద్దరి పుట్టిన రోజు సందర్భంగా మంచు ఫ్యామిలీ వారు ఆ వేడుకని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిన్నారులను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ అందమైన కవల పిల్లలకి 123తెలుగు.కామ్ అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Exit mobile version