బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ మోతకి కొత్త ప్లానింగ్?

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘అఖండ 2’ మోతకి కొత్త ప్లానింగ్?

Published on Nov 22, 2025 12:00 AM IST

Akhanda 2

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే అఖండ 2 తాండవం. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో అత్యంత ఘనంగా రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు వినిపిస్తుంది.

మరి అదేంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ కి ముందే అంటే డిసెంబర్ 4 నుంచే సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకి పడనున్నట్టుగా తెలుస్తుంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఖండ 2 తాండవం మోత ముందే మొదలవుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు