దశాబ్దాలుగా గోవా ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా ఉంటూ వస్తుంది. ఇక అందమైన బీచ్ లు, ఆకర్షిణీయమైన సంస్కృతుల సమ్మేళనంతో కనిపించే గోవా రాష్ట్రం అన్ని చిత్ర పరిశ్రమల బెస్ట్ షూటింగ్ స్పాట్ గా ఉంది. అనేక వందల చిత్రాలు గోవాలో ఇప్పటికి షూటింగ్ జరుపుకున్నాయి. కాగా ఇకపై గోవాలో షూటింగ్ అంత సులభం కాకపోవచ్చు. అక్కడ ప్రభుత్వం గోవాని చిత్రాలలో చూపిస్తున్న తీరుకు నిరాశ చెందింది.
ఇటీవల ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటాని జంటగా తెరకెక్కిన మలంగ్ అనే చిత్రం విడుదలైంది. ప్రధాన భాగం గోవాలో షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం గోవా డ్రగ్స్ కి అడ్డా అన్నట్లుగా చూపించడం జరిగింది. దీనితో గోవా సీఎం ప్రమోద్ సావంత్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. ఇకపై గోవాలో షూటింగ్ జరుపుకోవాలనుకున్న చిత్రాలు స్క్రిప్ట్ గురించి వారికి తెలియజేయాలట. గోవాని డ్రగ్, సెక్స్ అడ్డాగా చూపించే క్రమంలో వారు ఆ చిత్రాలకు షూటింగ్ పర్మిషన్ ఇవ్వరట. కాబట్టి ఇకపై హ్యాపీగా వెళ్లి గోవాలో షూటింగ్ జరుపుకోవాలనుకుంటే అది అంత ఈజీ కాదు.