ఇండియా లోనే బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ గా ‘గ్లోబ్ ట్రాటర్’.. విశేషాలు ఇవేనా?

ఇండియా లోనే బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ గా ‘గ్లోబ్ ట్రాటర్’.. విశేషాలు ఇవేనా?

Published on Nov 9, 2025 8:00 PM IST

SSMB29

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ అంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అనే చెప్పాలి. గ్లోబ్ ట్రాటర్ అంటూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ సినిమా నుంచి బిగ్ రివీల్ ఈ నవంబర్ 15న రాబోతుంది.

అయితే ఆల్రెడీ ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ భారీ స్థాయిలో సన్నాహాలు కూడా చేపట్టింది. మరి మేకర్స్ అయితే ఈ ఈవెంట్ ని ఇండియా లోనే బిగ్గెస్ట్ లాంచ్ ఈవెంట్ గా చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఈవెంట్ ని చిత్ర యూనిట్ ఏ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి పలు విశేషాల కోసం కూడా టాక్ ఉంది.

ఈ ఈవెంట్ ని ఏకంగా లక్ష మందికి పైగా అభిమాన జన సంద్రం నడుమ ప్లాన్ చేస్తుండగా ఆ ఈవెంట్ లో దాదాపు 100 అడుగులకి పైగానే ఉండే భారీ తెరపై మహేష్ ఫ్యాన్స్ అలాగే ఈ కాంబినేషన్ కోసం చూస్తున్న వారు అందరికీ మేకర్స్ ప్లాన్ చేసిన కంటెంట్ ని వదలబోతున్నారని తెలుస్తుంది. ఇక వీటితో పాటుగా మరిన్ని ఆశ్చర్యకర ఎలిమెంట్స్ ఆ ఈవెంట్ లో అబ్బురపరచనున్నాయట. మరి వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు