త్వరలో విడుదల కానున్న గుండె జారి గల్లంతయ్యిందే ఆడియో

Gundejari-gallanthayinde

నితిన్ హీరోగా నిత్యమీనన్, ఇషా తల్వార్ లు హీరోయిన్స్ గా రాబోతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’. ఇది విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా. విక్రంగౌడ్ సమర్పణలో ఈ సినిమాని నికిత రెడ్డి నిర్మిస్తోంది. కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఆడియోని మార్చి 23న హైదరాబాద్లో విడుదల చేయవచ్చునని సమాచారం. గత సంవత్సరం నితిన్, నిత్య మీనన్ కలిసి నటించిన ‘ఇష్క్’ సినిమా ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదించింది.

ఇప్పుడు గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఏమైందో ఏమో ఈవేళ’ ని రీమేక్ చేస్తున్నారు. నితిన్ మాట్లాడుతూ ఈ పాటకి డాన్స్ అద్బుతంగా చేశాన్నాడు. ప్రముఖ బ్యాట్ మెంటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా మొదటి సారిగా ఈ సినిమాలో ఒక పాటలో కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలయ్యె అవకాశం ఉంది.

Exit mobile version