‘భైరవం’ నుండి పక్కా మాస్ అండ్ ఫోక్ సాంగ్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు ఈ సినిమాలోని ఓ పక్కా మాస్ అండ్ ఫోక్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘గిచ్చమాకు’ అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్‌ను మే 23న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది ఈ పాటను బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్‌ పై చిత్రీకరించారు.

ఇక ఈ సినిమాలో ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, అజయ్, సందీప్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా కెకె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 30న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

Exit mobile version