షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలం నుండి విడుదలకి ఎదురు చూస్తున్న గుండెల్లో గోదారి ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. గుండెల్లో గోదారి చిత్రానికి గాను సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికేట్ అందించింది. సెన్సార్ బృందం రెండు డైలాగ్స్ కట్స్, మూడు విజువల్ కట్స్ చెప్పారు. ఆది, లక్ష్మి మంచు, తాప్సీ, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఇళయరాజా స్వరపరిచిన పాటలకి ఇప్పటికే శ్రోతల నుండి మంచి స్పందన లభించింది. తెలుగుతో పటు తమిళ్లో కూడా విడుదలవుతున్న ఈ చిత్రం తమిళ్లో మరంతేన్ మన్నితేన్ పేరుతో విడుదల కాబోతుంది. తెలుగులో ఫిబ్రవరి 21న తమిళ్ ఫిబ్రవరి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.