మార్చి 7న నాని ‘జెండా పై కపిరాజు’

మార్చి 7న నాని ‘జెండా పై కపిరాజు’

Published on Feb 19, 2014 6:55 PM IST

genda-by-kapi-raju

యంగ్ హీరో నాని,అమలాపౌల్‌ జంటగా సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జెండా పై కపిరాజు’. మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై లిమిటెడ్‌ బ్యానర్‌ పై వాసన్‌ విజువల్స్‌తో కలిసి నిర్మాత రజత్‌ పార్దసారధి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి తొలి వారంలో విడుదలకు సిద్దమవుతోంది.

ఈ సందర్బంగా నిర్మాత రజత్‌పార్ధసారధి మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కదాకధనాలతో, అద్బుతమైన టెక్నికల్‌ వాల్యూస్‌తో నాని హీరోగా దర్శకుడు సముద్రఖని తీసిన జెండాపై కపిరాజు సినిమా అతి త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది. నాని కెరీర్‌లోనె నెంబర్‌వన్‌ మూవీగా నిలిచిపోయె ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చెసుకొని సెన్సార్‌కు సిద్దమయింది.తమిళ్‌ వెర్షన్‌ ఇప్పటికే సెన్సార్ సభ్యుల నుండి మన్ననలు అందుకొంది. తెలుగులోనూ ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి. ఎట్టిపరిస్ధితులలోనూ జెండా పై కపిరాజు అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ రీచ్‌ అయి ప్రేక్షకుల,విమర్శకుల ప్రశంసలను అందుకోవటం ఖాయం.మార్చి 7న తెలుగు,తమిళ బాషల్లో ఒకేమారు విడుదల చెసెందుకు సన్నాహాలు చేస్తున్నాము. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ అందించిన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి.తప్పకుండా జెండా పై కపిరాజు ఈ యేటి మేటి చిత్రంగా నిలుస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు’.

తాజా వార్తలు