విషాదం: నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

విషాదం: నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

Published on Sep 22, 2025 12:05 PM IST

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి గీతా రాధ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. చివరకు గీతా రాధ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాధిక అధికారికంగా తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. ఇవాళ చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో గీతా రాధకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.

అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గీతా రాధ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మొదట కోలుకున్నెలా కనిపించారు. కానీ సడెన్ గా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బ తింది. గీతా రాధ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. గీతా రాధ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున గీతా రాధ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు