రానున్న సినిమాల రిలీజ్ డేట్స్ మారనున్నాయా?

telugu-cinema-logo

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో పడి కొట్టుకుంటోంది. తెలంగాణ ఏరియా ప్రశాంతంగా ఉంటే, సీమాంధ్ర ఏరియా మొత్తం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినందుకు నిరసనలతో రావణ కాష్టంలా మారింది. నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్న కొద్దీ రాజకీయ నేతలు కూడా వారితో వచ్చి చేరుతున్నారు.

నిరసనల, ఆందోళనల పర్వం కొనసాగుతున్న ఈ తరుణంలో… త్వరలో రిలీజ్ కానున్న సినిమాల రిలీజ్ డేట్స్ మారే అవకాశం ఉందా?. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ ఇప్పటికే 7 నుండి 9కివాయిదా పడింది. సీమాంధ్ర జెఎసి నేతలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాని తమ ఏరియాలో రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ‘ఎవడు’ని ఆగష్టు 21 న రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు.

ఇప్పటివరకూ అయితే నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రిలీజ్ డేట్స్ లో ఎలాంటి మార్పు ఉండకూడదని కోరుకుందాం.

Exit mobile version