ఫన్ మ్యాడ్నెస్ షురూ.. బన్నీ వాస్ సమర్పణలో సాలిడ్ ఎంటర్టైనర్ ప్రీ లుక్

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో బన్నీ వాస్ కూడా ఒకరు. అయితే ఇది వరకు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన తాను ఇపుడు నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్ మరియు హాయ్ నాన్న నిర్మాణ సమస్య వైరా ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా సినిమాను సమర్పిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్ తో కలిసి తండేల్ కి పని చేసి, బ్లాక్ బస్టర్ ను అందించారు. ఈ ద్వయం ‘ఆయ్’, ‘సింగిల్’ వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతున్నారు.

తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్నెస్ తో ఫన్ రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. ఇక జూన్ 6న అసలు ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.

Exit mobile version