‘సూర్య – వెంకీ’ సినిమాలో స్పెషల్ సాంగ్ ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి చాలా కాలంగా చూస్తున్నాడు. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేయాలని వెంకీ అట్లూరి ప్లాన్ చేస్తున్నాడట. అన్నట్టు వచ్చే షెడ్యూల్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం సూర్యతో పాటు దాదాపు 100 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version